
సాక్షి, సినిమా : హాలీవుడ్‌ను కుదిపేసిన హర్వే వెయిన్‌స్టెయిన్ ఉదంతంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తన గర్ల్ ఫ్రెండ్‌పై సైతం లైంగిక వేధింపులకు పాల్పడటంతో సహించలేని బ్రాడ్ పిట్ ఆ సమయంలో హర్వేకు సాలిడ్ వార్నింగ్ ఇచ్చాడంట. ఈ విషయాన్ని నటి, పిట్ మాజీ ప్రేయసి గ్వైనెత్ పాల్‌ట్రో వెల్లడించారు.
గ్వైనెత్ హర్వే ప్రొడక్షన్ హౌజ్‌లో షేక్స్ పియర్ ఇన్ లవ్ అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో నటనకుగానూ ఆమెకు అకాడమీ అవార్డు కూడా దక్కింది. ఆ సమయంలో హర్వే ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడంట. ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడు అయిన బ్రాడ్ దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే ఆగ్రహానికి గురైన బ్రాడ్ ఓ పార్టీలో వెయిన్‌స్టెన్‌కు గట్టి వార్నింగే ఇచ్చాడంట. ఇంకోసారి ఇది రిపీట్ అయితే పరిణామాలు దారుణంగా ఉంటాయని చెప్పాంట. తనని ప్రాజెక్టు నుంచి తప్పించకపోయినప్పటికీ.. కోపాన్ని మాత్రం హర్వే మరోలా ప్రదర్శించాడని ఆమె పేర్కొంది.
ఈ ఘటనను పాలట్రో న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘‘ఆ సమయంలో బ్రాడ్ పిట్ కెరీర్ ఇంకా ప్రారంభదశలోనే ఉంది. ఏకంగా హర్వేతోనే పెట్టుకోవటంతో అతని కెరీర్ నాశనం అవుతుందని భయపడ్డాను. కానీ, ఆ ప్రభావం పిట్ పై పడలేదు. పైగా వార్దిదరూ కలిసి ఓ చిత్రం కూడా చేయటం నాకు ఆశ్చర్యం కలిగించింది అని ఆమె తెలిపారు. కాగా, హాలీవుడ్ మూవీ మొఘల్ పై ఇప్పటిదాకా 80 మంది నటీమణులు ఆరోపణలు చేయగా.. అందులో స్టార్ నటి, బ్రాడ్ పిట్ మాజీ భార్య ఏంజెలీనా జోలీ కూడా ఉండటం గమనార్హం.
బ్రాడ్ పిట్‌తో గ్వైనెత్ పాల్‌ట్రో పాత ఫోటో