జాన్వీకి సౌత్‌ సినిమాలంటే ఇష్టం : బోనీ కపూర్‌

Boney Kapoor Says That Jhanvi Likes South Indian Movies - Sakshi

ధడక్‌ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్‌కు సౌత్‌ సినిమాలపై ఆసక్తి లేదనే వార్తలు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో స్టార్‌ హీరోల పక్కన అవకాశం వచ్చినా.. ఆ ఆఫర్స్‌ అన్నింటిని తిరస్కరిస్తోందని వార్తలు హల్‌చల్‌ చేస్తున్న తరుణంలో ఈ రూమర్స్‌పై బోనీ కపూర్‌ పుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 

తమకు సౌత్‌ సినిమాలంటే ఇష్టమని.. శ్రీదేవీ అక్కడి నుంచే వచ్చిందని, సూపర్‌స్టార్‌ కృష్ణ, మెగాస్టార్‌ చిరంజీవి ఇలా ప్రముఖ హీరోలందరితో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని బోనీ కపూర్‌ చెప్పుకొచ్చాడు. మహేష్‌బాబుతో, రామ్‌చరణ్‌ సినిమాల్లో అవకాశాలు వచ్చాయని, జాన్వీ వాటికి తిరస్కరించందనే వార్తల్లో ఏమాత్రం నిజంలేదంటూ క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే సౌత్‌లోనూ ఎంట్రీ ఇవ్వనుందని, సరైన కథ కోసం ఎదురుచూస్తున్నామని బోనీకపూర్‌ తెలిపాడు. తాజాగా అజిత్‌ హీరోగా బోనీ కపూర్‌ నిర్మించిన ‘నేర్కొండ పార్వై’ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top