రేప్‌ కేసులో ప్రముఖ టీవీ నటుడు అరెస్ట్‌ | Beyhadh actor Piyush Sahdev arrested for allegedly raping fashion designer | Sakshi
Sakshi News home page

రేప్‌ కేసులో ప్రముఖ టీవీ నటుడు అరెస్ట్‌

Nov 25 2017 9:21 AM | Updated on Aug 20 2018 4:30 PM

Beyhadh actor Piyush Sahdev arrested for allegedly raping fashion designer - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి,ముంబై: ప్రముఖ టీవీ నటుడు రేప్‌ కేసులో అరెస్ట్‌ అయ్యాడు.  ఇటీవల భార్యకు విడాకులు ఇచ్చి వార్తల్లో నిలిచిన పియూష్‌ సహదేవ్‌(35) పై తాజాగా అత్యాచారం కేసు నమోదు  కావడంతో మరోసారి సంచలనంగా మారాడు.    ముంబైకి చెందిన ఫ్యాషన్‌ డిజైనర్‌ అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో వెర్సోవా పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఒక ఫ్యాషన్‌ షోలో పరిచయమైన బేహద్ నటుడు పియూష్‌ తనతో  స్నేహం చేసి మోసం చేశాడని ఫ్యాషన్ డిజైనర్‌(23) ఆరోపిస్తోంది. గత మూడునెలలుగా  తాము సహజీవనం చేస్తున్నామనీ,  పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ అతనిపై కేసు నమోదు చేసింది.   దీంతో  పోలీసులు  పియూష్‌ను అరెస్ట్‌ చేసి, అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుముందు హాజరుపరిచారు. నవంబరు 27వరకు రిమాండ్‌కు తరలించారు. విచారణ కొనసాగుతోందని  దర్యాప్తు అధికారి అధికారి కిరణ్‌ కాలే వెల్లడించారు.

కాగా నటుడు పియూష్‌.. బేహద్‌,  దేవోంకే దేవ్‌ మహదేవ్‌‌, హర్ ఘర్ కుచ్ కెహతా హై లాంటి హిందీ టెలివిజన్‌ సీరియల్స్‌తో బాగా పాపులర్‌ అయ్యాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement