బాహుబలి రీమేకా.. అయ్యే పనేనా?

Baahubali Remake in Gujarati by Nitin and Tarun Jani - Sakshi

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ విజువల్‌ వండర్ బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుతం తెలుగుతో పాటు ఉత్తరాదిలోనూ ఘనవిజయం సాధించింది. బాలీవుడ్ సినిమాలకు కూడా సాధ్యం కాని రికార్డ్‌లను కొల్లగొట్టి బిగెస్ట్ ఇండియన్‌ మూవీగా చరిత్ర సృస్టించింది. అసలు బాహుబలి సినిమా చూడని మూవీ లవర్‌ఉండడంటే అతిషయోక్తి కాదు. అలాంటి భారీ చిత్రాన్ని ఇప్పుడు రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నారట.

వందకోట్ల బడ్జెట్‌తో ఆర్కా మీడియా సంస్థ తెరకెక్కించిన బాహుబలి చిత్రాన్ని గుజరాతీ భాషల్లో రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే నిర్మాతలు నితిన్‌ జానీ, తరుణ్‌ జానీ  రీమేక్‌ హక్కులను కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే హిందీలోనూ చాలా సార్లు టీవీలో వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు రీమేక్‌ చేస్తే బిజినెస్‌ పరంగా వర్క్‌ అవుట్ అవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఒక వేళ రీమేక్‌ చేసిన ఒరిజినల్ వర్షన్‌తో పోటి పడగలరా..? అంత సమయం కేటాయించి, అంత ఖర్చు పెట్టి, ఆ స్థాయిలో గ్రాఫిక్స్‌ అవుట్‌పుట్‌ సాధ్యమేనా అంటున్నారు విశ్లేషకులు. కొందరైతే మరొ అడుగు ముందుకేసి బాహుబలిని రీమేక్‌ చేయటం తుగ్లక్‌ చర్య అని కామెంట్ చేస్తున్నారు. నితిన్‌, తరుణ్‌ లు మాత్రం గుజరాతీ స్టైల్‌, కాస్త తక్కువ బడ్జెట్‌లో బాహుబలిని రీమేక్‌ చేస్తే వర్క్‌ అవుట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top