ప్రపంచం ఏమైతే నాకేంటి? | Ayushman Bhava in last schedule | Sakshi
Sakshi News home page

ప్రపంచం ఏమైతే నాకేంటి?

Jun 29 2018 1:24 AM | Updated on Jun 29 2018 1:24 AM

Ayushman Bhava in last schedule - Sakshi

చరణ్‌తేజ్‌, స్నేహా ఉల్లాల్‌

చరణ్‌తేజ్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆయుష్మాన్‌ భవ’, స్నేహా ఉల్లాల్‌ కథానాయిక. ‘నేనులోకల్‌’ చిత్ర దర్శకుడు త్రినాథ్‌రావు నక్కిన కథ, దర్శకత్వ పర్యవేక్షణలో, దర్శకుడు మారుతి సహ నిర్మాతగా సి.టి.ఎఫ్‌ నిర్మాణ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చరణ్‌ తేజ్‌ మాట్లాడుతూ–‘‘సమాజం ప్రేమను చూసే పద్ధతి మారాలి అనే కమర్షియల్‌ పాయింట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది.

ప్రేమించిన అమ్మాయి కులం, మతం వేరైతే మర్చిపోవాలా? పారిపోవాలా? చచ్చిపోవాలా? ప్రపంచం ఏమైతే నాకేంటి. సమాజం ప్రేమను చూసే విధానం మారాలి.. లేదంటే చంపేస్తా. అనుకునే హీరో క్యారెక్టర్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా ద్వారా స్నేహా ఉల్లాల్‌ టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తున్నారు. మరో తెలుగు టాప్‌ హీరోయిన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్, త్రినాథ్‌రావు నక్కిన స్క్రీన్‌ప్లే బాగుంటుంది.  నవంబర్‌ 9న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మీట్‌ బ్రోస్, కెమెరా: దాసరధి శివేంద్ర, అసోసియేట్‌ ప్రొడ్యూసర్స్‌ : బి.ఏ.శ్రీనివాసరావు, హేమరత్న.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement