తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘జిగేల్’ | Arun Adith Jigel First Schedule Completed | Sakshi
Sakshi News home page

Jul 24 2018 4:45 PM | Updated on Jul 24 2018 4:45 PM

Arun Adith Jigel First Schedule Completed - Sakshi

కథ సినిమాతో హీరోగా పరిచయం అయిన అరుణ్ ఆదిత్ ఇటీవల గరుడవేగ సినిమాతో మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. ఈ యంగ్‌ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘జిగేల్’. శ్రీ ఇందిరా కంబైన్స్ పతాకంపై అల్లం నాగార్జున నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమాలో అరుణ్ ఆదిత్ సరసన ‘జంబ లకిడి పంబ’ ఫేమ్ సిద్ధి ఇద్నాని కథానాయికగా నటిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు మల్లి యేలూరి మాట్లాడుతూ.. ‘కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతొన్న జిగేల్ తొలి షెడ్యూల్ పూర్తయింది. జులై 30 నుంచి రెండో షెడ్యూల్ మొదలవుతుంది. ఆగస్ట్ 20 వరకు జరిగే చిత్రీకరణతో టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుంది. సెప్టెంబర్‌లో సినిమా టోటల్ షూట్ పూర్తి చేస్తామన్నా’రు.

చిత్ర నిర్మాత అల్లం నాగార్జున మాట్లాడుతూ.. ‘భారీ తారాగణంతో , కథకు తగ్గ బడ్జెట్ తో తెరకెక్కనున్న హైక్వాలిటీ చిత్రం ‘జిగేల్’. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ది బెస్ట్ టీమ్ వర్క్ చేస్తున్నారు. కథే ఈ చిత్రానికి ప్రధాన బలం. మా టీమ్ అందరికి జిగేల్ మంచి పేరును తీసుకువస్తుందన్నా’రు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement