నిర్మాతగా మారనున్న నటి అనుష్క శర్మ | Anushka Sharma turns producer with 'NH10' | Sakshi
Sakshi News home page

నిర్మాతగా మారనున్న నటి అనుష్క శర్మ

Oct 31 2013 9:37 PM | Updated on Apr 3 2019 6:23 PM

ఇన్నాళ్లు హీరోయిన్‌గా అందాలు అరబోస్తు అందరిని అలరించిన బాలీవుడ్ నటి అనుష్క శర్మ నిర్మాతగా కొత్త అవతారమెత్తేందుకు సిద్ధమైంది.

ముంబై: ఇన్నాళ్లు హీరోయిన్‌గా అందాలు అరబోస్తు అందరిని అలరించిన బాలీవుడ్ నటి అనుష్క శర్మ నిర్మాతగా కొత్త అవతారమెత్తేందుకు సిద్ధమైంది.  ఫంటోమ్ ప్రొడక్షన్‌లో వస్తున్న ‘ఎన్‌హెచ్ 10’లో హీరోయిన్‌గా పాటు సహచర నిర్మాతగా సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. నవదీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కథ నచ్చడంతో సహచర నిర్మాతగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. సినీ కెరీర్‌లోనే ఈ అవకాశం ఇంత త్వరగా వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఎన్‌హెచ్ 10కన్నా మంచి ప్రాజెక్టు ఇప్పటివరకు తాను ఎక్కడా వినలేదని చెప్పింది. ఈ సినిమాతో తన కెరీర్ కొత్త పుంతలు తొక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.  
 
 

ఫంటోమ్ ప్రొడక్షన్‌లో బాంబే వెల్వెట్ తర్వాత ఇది రెండో సినిమా అని వివరించింది.  ఫంటోమ్ ప్రొడక్షన్‌లో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. మళ్లీ ఆ అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని, అందుకోసం ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. ఇదికాక ఆమీర్‌ఖాన్‌తో నటించిన పీకే, రణ్‌బీర్ కపూర్‌తో చేసిన బాంబే వెల్వేట్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయని వివరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement