‘సాహో’పై స్పందించిన అనుష్క

Anushka Comment On Prabhas Saaho poster - Sakshi

బాహుబలి తరువాత యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సాహో. బాహుబలితో ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్‌ రావటంతో సాహోను కూడా అదే స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ సర్‌ప్రైజ్‌ను ప్రభాస్‌ రివీల్‌ చేశారు.  సినిమా రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించటంతో పాటు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశాడు. డిఫరెంట్ స్పెక్ట్స్‌తో సీరియస్‌ లుక్‌లో ఉన్న ప్రభాస్‌ పోస్టర్‌ క్షణాల్లో వైరల్‌గా మారింది.

తాజాగా సాహో పోస్టర్‌పై బాహుబలి హీరోయిన్‌ అనుష్క శెట్టి తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ‘ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అంశం.. ఆ తర్వాత ఏంటి? అన్న ఆలోచనలో పడేస్తోంది. ప్రతిసారీ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆగస్ట్‌ 15 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ప్రభాస్‌, యూవీ క్రియేషన్స్‌, సుజిత్‌కు, బృందంలోని ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు ఆల్‌ ది బెస్ట్‌..’ అని  స్వీటీ పేర్కొన్నారు.

కాగ ‘భాగమతి’ సినిమా తర్వాత ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న అనుష్క.. ప్రస్తుతం ‘సైలెన్స్’ అనే చిత్రంలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.. మాధవన్‌, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో  సినిమాను యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.  ప్రభాస్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top