కోలీవుడ్‌లో బిజీ అవుతున్న తెలుగమ్మాయి | Anjali currently busy with films | Sakshi
Sakshi News home page

Jan 17 2018 1:00 PM | Updated on Jan 17 2018 1:00 PM

Anjali currently busy with films - Sakshi

నటి అంజలి కోలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతోంది. ప్రస్తుతం నటుడు జైతో కలిసి నటించిన బెలూన్‌ చిత్రం మంచి విజయం సాధించింది. తాజాగా విజయ్‌ఆంథోనికి జంటగా కాళీ చిత్రంలో నటిస్తోంది ఈ బ్యూటీ. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటిస్తున్నా, అంజలికే అధిక ప్రాధాన్యత ఉంటుందట. తాజాగా అంజలికి మరో అవకాశం తలుపు తట్టింది. నాడోడిగళ్‌–2 చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది.

2009లో తెరపైకి వచ్చిన నాడోడిగళ్‌ చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శశికుమార్, విజయ్‌వసంత్, గంజాకరుప్పు, నటి అనన్య, అభినయ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. ఇదే చిత్రం తెలుగులోనూ శంభో శివశంబో పేరుతో రీమేక్‌ అయ్యింది. తాజాగా శశికుమార్‌ హీరోగా సముద్రఖని దర్శకుడిగా నాడోడిగళ్‌–2 చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో అంజలి కథానాయికగా నటించనుందన్నది. 

మరో హీరోయిన్‌గా నటి అతుల్యరవి నటించనుంది. ఈమె ఇప్పటికే సముద్రఖనితో కలిసి ఏమాలి చిత్రంలో నటిస్తోందన్నది. ఇన్‌స్పైర్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం మార్చిలో సెట్‌పైకి వెళ్లనుంది. ఐస్టిన్‌ ప్రభకరన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం నాడోడిగళ్‌ చిత్రానికి సీక్వెల్‌ కాదట. ఆ బాణీలో సాగే విభిన్న కథా చిత్రంగా నాడోడిగళ్‌–2 చిత్రం ఉంటుందని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. మొత్తం మీద నటి అంజలి కోలీవుడ్‌లో   వరుస అవకాశాలతో మళ్లీ బలం పుంజుకుంటోందన్న మాట.

Advertisement
 
Advertisement
Advertisement