పర్వీన్‌ బాబీగా అమలాపాల్‌?

Amala Paul To Play Role Parveen Babi In Web Series - Sakshi

‘‘1970ల్లో ఇండస్ట్రీకి వచ్చి శ్రమిస్తున్న దర్శకుడు, ఆ సమయంలో సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న హీరోయిన్‌కి మధ్య ఉన్న అనుబంధాన్ని కథగా మలిచి నా వెబ్‌సిరీస్‌ ప్రయాణం మొదలుపెడుతున్నాను’’ అని ఆ మధ్య ప్రకటించారు హిందీ దర్శక–నిర్మాత మహేశ్‌ భట్‌. అయితే ఇది నటి పర్వీన్‌ బాబీకి, మహేశ్‌ భట్‌కి మధ్య జరిగిన వాస్తవ కథే అని బాలీవుడ్‌ టాక్‌. పర్వీన్‌ బాబి బయోపిక్‌ తరహాలోనే ఈ వెబ్‌ సిరీస్‌ ఉంటుందని సమాచారం. పర్వీన్‌ బాబీగా అమలాపాల్‌ నటించబోతున్నారన్నది తాజా వార్త. పర్వీన్‌ బాబీ పాత్రకు అమలా పాల్‌ కరెక్ట్‌గా సరిపోతారని టీమ్‌ భావించారట. ఈ వెబ్‌ సిరీస్‌ను మహేశ్‌ భట్, ముఖేష్‌ భట్‌ కలిసి విశేష్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తారు. త్వరలోనే ఈ షూటింగ్‌లో జాయిన్‌ కాబోతున్నారట అమలా పాల్‌. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top