జాతి, మత జాడ్యాలతో భయంగా ఉంది

Amala paul Comments on Ethnic and religious - Sakshi

సినిమా: జాతి, మత జాడ్యాలతో భయంగా ఉందని నటి అమలాపాల్‌ పేర్కొంది. ఈమె దృఢమైన వ్యక్తిత్వం కలిగిన నటి అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ విషయాన్నైనా నిర్భయంగా, ముక్కుసూటిగా మాట్లాడే అరుదైన నటి ఈ జాణ. ఒక నటిగా అమలాపాల్‌ ఎదుర్కోని సవాల్‌ లేదనే చెప్పాలి. అన్నింటిని ధైర్యంగా ఎదురొడ్డి నిలిచింది. నటిగానే కాదు వ్యక్తిగతం జీవితంలోనూ తనకు నచ్చిన బాటలో పయనిస్తోంది. అందుకు ఎవరెన్ని విధాలుగా విమర్శస్తున్నా, డోంట్‌కేర్‌ అంటోంది. ఇక వృత్తిపరంగా తనకు నచ్చింది చేసే నటి అమలాపాల్‌. దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లాడి, ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న నటి అమలాపాల్‌. అయితే వివాహాం, విడాకులనంతరం హీరోయిన్‌గా రాణిస్తున్న అతి కొద్దిమంది నటీమణుల్లో ఈమె ఒకరని చెప్పవచ్చు. ]

గ్లామర్‌ పాత్రలను పక్కన పెట్టి హీరోయిన్‌ పాత్రలకు ప్రాధాన్యత కలిగిన చిత్రాలను ఎంచుకుంటూ ఆ దిశగా సాగుతోంది. అలా నటించిన తొలి చిత్రం ఆడై ఆమెకు సంతృప్తినిచ్చింది. ఆడై చిత్రంలో నగ్నంగా నటించి విమర్శలను ఎదుర్కొన్న ఈమె చిత్ర విడుదల తరువాత తన నటనకు ప్రశంసలను అందుకుంటోంది.  ఈ సందర్భంగా పలు విషయాలపై తన అభిప్రాయాలను స్పష్టపరిచింది. శ్వాస ఉన్నంత వరకూ సినిమాని ప్రేమిస్తాను. నాకేమైనా చిత్రం నుంచి ఆడై వరకూ ప్రేక్షకులు ఆమోఘ ఆదరణను అందిస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ పుడమి, భాష, ప్రజల నుంచే నేను ఎంతో నేర్చుకున్నాను. జాతి, మతం అనే భేదాభిప్రాయాలు సమసిపోవాలి. ప్రజల్లో మానవత్వాన్ని పెంపొందించడానికి అందరం పాటు పడాలి. సమీపకాలంలో పలు హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. మతం, జాతి పరంగా భయం కలగుతోంది. వాటిని త్యజించాలి. మనిషిని మనిషిగా చూడాలి. ఈ భావన సమాజంలో కలగాలి. అని పేర్కొంది. ప్రస్తుతం అదో అంద పరవై పోల చిత్రంలో నటిస్తోంది. త్వరలో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top