షూటింగ్‌ సెట్‌లో అయాన్‌, అర్హా | Allu Arjun And Trivikram Movie First Day Shoot | Sakshi
Sakshi News home page

షూటింగ్‌ సెట్‌లో అయాన్‌, అర్హా

Apr 24 2019 7:20 PM | Updated on Apr 24 2019 7:32 PM

Allu Arjun And Trivikram Movie First Day Shoot - Sakshi

తొలి రోజు షూట్‌ సందర్భంగా తీసిన ఓ వీడియోను..

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. బుధవారం సెట్స్‌ పైకి వెళ్లింది. అయితే ఈ సినిమా తొలి రోజు షూట్‌ సందర్భంగా తీసిన ఓ వీడియోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. సెట్స్‌లో బన్నీ కుమారుడు అల్లు అయాన్‌, కుమార్తె అర్హాలు కనిపించడం హైలెట్‌గా నిలిచింది. స్టైలిష్‌గా కారులో నుంచి దిగిన బన్నీ సెట్‌లోకి ఎంటర్‌ అయ్యారు. ఇంకా ఈ వీడియోలో త్రివిక్రమ్‌, నిర్మాత రాధాకృష్ణ, బన్నీ వాసు, సినిమాటోగ్రాఫర్‌ పీఎస్‌ వినోద్‌లతో పాటు చిత్ర యూనిట్‌ను చూపించారు.

ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నారు. చాలాకాలం తర్వాత ప్రముఖ నటి టబు తెలుగులో నటిస్తుండటం విశేషం. సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్‌ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement