వైకుంఠపురములో పాట

ala vaikuntapuramlo poster release - Sakshi

ఒక చేతిలో పుంజు, మరో చేతిలో కత్తి పట్టుకుని సంక్రాంతి పందేనికి బాక్సాఫీస్‌ బరిలో దిగుతున్నారు అల్లు అర్జున్‌. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అల... వైకుంఠపురములో...’. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇది వరకే ప్రకటించింది. తాజాగా జనవరి 12న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు విడుదల తేదీని శనివారం అధికారికంగా వెల్లడించారు. అలాగే అల్లు అర్జున్‌ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కీలక తారాగణంపై పాట చిత్రీకరిస్తున్నారు. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top