అల.. బాలీవుడ్‌ తెరపైకి!

Ala Vaikuntapuramlo is planning to remake in Hindi - Sakshi

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల.. వైకుంఠపురములో..’ అనూహ్య విజయాన్ని సాధించింది. అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో రీమేక్‌ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.  తెలుగు హిట్‌ ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’కి ఒక నిర్మాతగా ఉన్న అశ్విన్‌ వార్దే ‘అల.. వైకుంఠపురములో..’ హిందీ రీమేక్‌ రైట్స్‌ను దక్కించుకున్నారని సమాచారం. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? ఎవరు హీరోగా నటిస్తారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది. హీరోగా అక్షయ్‌ కుమార్‌ లేదా షాహిద్‌ కపూర్‌ నటిస్తారనే ప్రచారం జరుగుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top