డిష్యుం.. డ్యూయెట్

డిష్యుం డిష్యుం అంటూ విలన్స్‌ని రఫ్పాడించిన అల్లు అర్జున్, హీరోయిన్‌తో డ్యూయెట్‌కి రెడీ అవుతున్నారని సమాచారం. అందుకే యూరప్ ప్రయాణమయ్యారు కూడా. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా రూపొందుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో...’. అల్లు అరవింద్, యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
ఇటీవలే హైదరాబాద్‌లో ఓ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించారు చిత్రబృందం. ఇప్పుడు ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ కోసం యూరప్ వెళ్లారని తెలిసింది. ఫ్రాన్స్‌లో అల్లు అర్జున్, పూజాహెగ్డేలపై ఈ పాటను తెరకెక్కిస్తారట. టబు, జయరామ్, సుశాంత్, నివేదా పేతురాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి