
ముంబై : బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ బంధువు సచిన్ కుమార్ గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశారు. బుధవారం(మే13)న ఆయన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న రెండు రోజులకే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సచిన్.. అక్షయ్ కుమార్‌కు బంధువు మాత్రమే కాదు అత్యంత సన్నిహితుడు కూడా. సచిన్ మరణ వార్త వినడంతో అక్షయ్ కుమార్ కుటుంబం అక్కడికి చేరుకుంది. సచిన్ మరణంపై బాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు సంతాపం ప్రకటించారు .ఆయన మరణాన్ని అతని స్నేహితుడు రాక్‌శ్ పాల్ ధ్రువీకరించాడు. సచిన్ మరణ వార్త వినగానే షాక్‌కు గురయినట్లు ఆయన తెలిపారు. ఆయన మరణం హృదయ విదారకమని, తమకు ఎంతో లోటును మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన అంత్యక్రియలు జరుగుతున్నట్లు తెలిపారు. (ఈ బర్త్‌డే బాయ్‌ను గుర్తు పట్టారా ! )
ఏక్తా కపూర్ నటించిన 'కహానీ ఘర్ ఘర్ కీ' సినిమాలో సచిన్ కుమార్ హారోగా నటించారు. అనంతరం ఫోటో గ్రాఫర్‌గా మారి నటనకు గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. శుక్రవారం ఉదయం సచిన్ తలుపు తీయకపోవడంతో.. కుటుంబ సభ్యులు బయపడి తలుపు తీయడంతో అప్పటికే ఆయన కుప్పకూలిపోయి ఉన్నారు. అయితే వెంటనే ఆసుపత్రకి తరలించగా అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. (ప్రియాంక లగ్జరీ విల్లా ఎలా ఉందో చూశారా )