
అజిత్ తదుపరి చిత్ర నిర్మాత ఎవరు?
అజిత్ తదుపరి చిత్రం ఏమిటీ? దానికి నిర్మాత ఎవరూ? లాంటి పలు ప్రశ్నలు చిత్ర పరిశ్రమలోనే కాదు ఆయన
అజిత్ తదుపరి చిత్రం ఏమిటీ? దానికి నిర్మాత ఎవరూ? లాంటి పలు ప్రశ్నలు చిత్ర పరిశ్రమలోనే కాదు ఆయన అభిమానుల్లోనూ రేకెత్తిస్తున్నాయి. కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ తరువాత అంత ప్రాచుర్యం గల నటుడు అజిత్. ఇటీవల వరుస చిత్రాలతో తన స్థాయిని పెంచుకుంటూ పోతున్న ఆయన ఈ మధ్య వరుసగా నిర్మాత ఏఎం.రత్నం బ్యానర్‌లోనే చిత్రాలు చేస్తూ వచ్చారు.
ఆరంభం,ఎన్నై అరిందాల్, వేదాళం ఇలా మూడు చిత్రాలు ఒకే నిర్మాతకు చేసిన అరుదైన నటుల్లో అజిత్ ఒకరని చెప్పవచ్చు. విశేషం ఏమిటంటే ఆ మూడు చిత్రాలు విజయం సాధించాయి. వేదాళం తరువాత అజిత్ ఏ నిర్మాతకు చిత్రం చేస్తారన్న ఆసక్తి నెలకొంది. సత్యజ్యోతి ఫిలింస్ చిత్రం చేయనున్నారనే ప్రచారం ఇంతకు ముందు జరిగింది.
అయితే తాజాగా అజిత్ బిల్లా-2 చిత్ర నిర్మాత సురేశ్ బాలాజీకి మరో అవకాశం ఇస్తున్నట్లు తాజా సమాచారం. అజిత్ నటించిన బిల్లా-2 చిత్రం ఆశించిన విజయం సాధించలేదు.దీంతో ఆ చిత్ర నిర్మాతకు మరో చిత్రం చేయాలని అజిత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా అజిత్‌గానీ నిర్మాత సురేశ్ బాలాజీ గానీ అధికారిక పూర్వంగా వెల్లడించలేదన్నది గమన్హారం . కాలుకు శస్త్ర చికిత్స చేయించుకున్న అజిత్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.