ఈ ప్రముఖ నటి ఎవరో గుర్తుపట్టగలరా?

After Two Years Thanushree Dutta Back To Mumbai - Sakshi

ఆదివారం సందడిగా ఉన్న ముంబై ఎయిర్‌పోర్టులో ఉన్నట్టుండి ఫ్లాష్‌బల్బులు అన్ని ఒక్కసారిగా మరింత ప్రకాశవంతంగా వెలిగాయి. అక్కడ ఉన్నట్టుండి ఒక తార కనిపించింది. బ్లూ టాప్‌, బ్లాక్‌ జెగ్గింగ్‌ ధరించిన ఓ అందమైన యువతి అలా నడుచుకుంటూ వస్తోంది. కెమరా కన్ను కూడా ముందు ఆమెను గుర్తుపట్ట లేదు. ఓ నిమిషం తర్వాత అరె..! ఈమె తనా.. రెండేళ్లలో ఎంత మార్పు అంటూ ఆశ్చర్యపోయింది. ఇంతకు ఎవరామె అని ఆలోచిస్తున్నారా. ఆమె 2005లో ‘ఆషిఖ్‌ బనయా ఆప్నే’తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నటి. ఇప్పటికైనా గుర్తుకోచ్చారా.. అవును ఆమె తనుశ్రీ దత్తా.

రెండేళ్ల తర్వాత అమెరికా నుంచి ముంబై వచ్చారు తనుశ్రీ దత్తా. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో విక్టరి సింబల్‌ను చూసిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. 2003లో ‘మిస్‌ ఇండియా’గా నిలిచిన తనుశ్రీ ‘ఆషిఖ్‌ బనయా ఆప్నే’తో బాలీవుడ్‌లో ప్రవేశించి, ఆపై వరుసగా ‘చాకోలేట్‌’, ‘రఖీబ్‌’, ‘ధోల్‌’, ‘రిస్క్‌’, ‘గుడ్‌ బాయ్‌, బ్యాడ్‌ బాయ్‌’ వంటి హింది చిత్రాలోనే కాక తెలుగులో ‘వీరభద్ర’ సినిమాలో బాలయ్యతో జత కట్టారు. 2010లో వచ్చిన ‘అపార్ట్‌మెంట్‌’ తనుశ్రీకి హిందీలో చివరి సినిమా. రెండేళ్ల క్రితం ఈ నటి అమెరికా వెళ్లిపోయారు. అమెరికా నుంచి ముంబై వస్తుండగా విమానంలో తీసిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ ‘రెండేళ్ల తర్వాత ముంబై వస్తున్నాను. చాలా సంతోషంగా, మరికాస్తా ఆందోళనగా ఉందంటూ’ పోస్టు చేశారు.

తనుశ్రీ ముంబై వచ్చిందని తెలిసిన ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మళ్లీ ఆమెను సినిమాల్లో నటించమని కోరుతున్నారు. ‘మీరు నటించిన ఆషిఖ్‌ బనయా ఆప్నే సీక్వెల్‌లో నటిస్తే చూడాలని ఉంటంటూ’ ఓ అభిమాని కోరాడు.


తనుశ్రీ దత్తా (పాత చిత్రం)

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top