కూతురికి ప్రముఖ సింగర్‌ కాస్ట్లీ గిఫ్ట్‌

Adnan Sami  gift worth  usd 4500 for daughter - Sakshi

ప్రముఖ‌ సింగర్‌, సంగీత కారుడు అద్నాన్ సమీ తన కూతురుకోసం విలువైన బహుమతిని కొనుగోలు చేశారు. తన చిన్నారిని ఈజీగా క్యారీ చేసేందుకు వీలుగా స్ట్రోలర్‌ను కొన్నారు. అద్నాన్‌, రొయా సమీ దంపతుల రెండేళ్ల కుమార్తె  మెడీనా జాన్‌  మే 8వ తేదీన రెండవ పుట్టిన రోజు బహుమతిగా ఈ వెరీ స్పెషల్‌ స్ట్రోలర్‌ను ఇచ్చారు. అదీ  ఐకానిక్‌ బ్రిటిష్‌ ఆటోమొబైల్‌ తయారీ దారు ఆస్టన్ మార్టిన్‌ కంపెనీది కావడం విశేషం. దీని ఖరీదు 4500 డాలర్లు (రూ. 3,14,696)

తనకు అరుదైన కార్లు, జేమ్స్‌ బాండ్‌సినిమాలు  అంటే చాలా ఇష్టమనీ అద్నాన్‌ చెప్పాడు. అలాగే తన కూతురికి కూడా స్పెషల్‌ స్ట్రోలర్‌ ఉండాలని కోరుకుంటున్నానని మీడియాకు తెలిపాడు. ఇందులో వుండే లెదర్‌ను  చాలా స్మూత్‌గా ఉండేలా, స్పెషల్‌ కలర్‌తో డిజైన్‌ చేయించినట్టు తెలిపారు. అలాగే తన గారాలపట్టి పుట్టిన రోజు వేడుకలు కొనసాగుతున్నా యంటూ అద్నాన్ సమీ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశాడు. ఈ సందర్భంగా పాపకోసం ఒక సందేశాన్ని  కూడా యాన పోస్ట్‌ చేశాడు. 

కాగా  అద్నాన్ సమీ తొలిసారి 1993లో పాకిస్థానీ నటి జీబా బక్తియార్ ని వివాహమాడాడు. వీరికి అజాన్ సమీ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత అరబ్ సబా గలాదారి అనే యువతిని 2001లో వివాహమాడాడు. అయితే జెర్మన్ గార్ల్ రొయా సమీ ఖాన్ అద్నాన్ సమీకి మూడవ భార్య. వీరికి గత ఏడాది మే నెల‌లో మెడీనా సమీ ఖాన్‌కు జన్మించిన సంగ‌తి తెలిసిందే

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top