చార్లీ చాప్లిన్‌తో స్టెప్పులు.. ప్రేమలు!

Adah Sharma to star opposite Prabhu Deva in 'Charlie Chaplin 2' - Sakshi

ఇప్పుడు చార్లీ చాప్లిన్‌ లేరు. కానీ, ఆయన పంచిన నవ్వులు ఈ లోకంలో ఉన్నాయి. చాప్లిన్‌లా పీపుల్‌ని ఫుల్లుగా నవ్వించడానికి తమిళంలో ఓ సిన్మా రూపొందుతోంది. శక్తీ చిదంబరం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభుదేవాకి జోడీగా ‘హార్ట్‌ ఎటాక్‌’ ఫేమ్‌ అదా శర్మ నటిస్తున్నారు. 2002లో ప్రభు, ప్రభుదేవా హీరోలుగా వచ్చిన ‘చార్లీ చాప్లిన్‌’కి సీక్వెల్‌ ఇది. గురువారం గోవాలో చిత్రీకరణ మొదలైంది. ఆల్రెడీ అదా శర్మ సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్‌డే ప్రభుదేవా, అదాలపై కొన్ని సీన్స్‌ తీశారు.

ప్రభుదేవా అంటే జస్ట్‌ కామెడీ మాత్రమేనా? సాంగుల్లో స్టెప్పులు ఇరగదీసేస్తారు కదా! అండ్‌ రొమాంటిక్‌ లవ్‌ ట్రాక్‌ తప్పకుండా ఉంటుంది.సో, చార్లీ చాప్లిన్‌గా రాబోతున్న ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవాతో అదా ఏ విధంగా స్టెప్పులు వేస్తారో! ప్రేమలు పండిస్తారో! అన్నట్టు... ఫస్ట్‌ పార్ట్‌ ‘చార్లీ చాప్లిన్‌’ని తెలుగులో శ్రీకాంత్, వేణు హీరోలుగా ‘పెళ్లాం ఊరెళితే’ పేరుతో రీమేక్‌ చేశారు. మరి, ఈ సీక్వెల్‌ని రీమేక్‌ చేస్తారో? లేదా ప్రభుదేవా, అదా శర్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులు కావడంతో డబ్‌ చేస్తారో? వెయిట్‌ అండ్‌ సీ!! తమిళ్‌లో అదాకి హీరోయిన్‌గా ఇదే మొదటి సినిమా. అంతకు ముందు శింబు ‘ఇదు నమ్మ ఆళు’లో అతిథి పాత్ర చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top