టామ్క్రూజ్ మూవీ షూటింగ్లో ప్రమాదం | accident in tom cruies movie shooting | Sakshi
Sakshi News home page

టామ్క్రూజ్ మూవీ షూటింగ్లో ప్రమాదం

Sep 12 2015 11:01 AM | Updated on Sep 3 2017 9:16 AM

హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్క్రూజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మెన' షూటింగ్ లో ప్రమాదం జరిగింది. షూటింగ్ లో వినియోగిస్తున్న ఓ మినీప్లేన్ క్రాష్ ల్యాండింగ్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు, మరో...

హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్క్రూజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మెన' షూటింగ్ లో ప్రమాదం జరిగింది. షూటింగ్ లో వినియోగిస్తున్న ఓ మినీప్లేన్ క్రాష్ ల్యాండింగ్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కొలంబియాలోని మెడెలిన్ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

శుక్రవారం మధ్యాహ్నం షూటింగ్ పూర్తి అయిన కొద్ది నిమిషాల తరువాత ప్రమాదం జరగటంతో యూనిట్లో ఎవరికీ ప్రమాదం జరగలేదు. టామ్ షూటింగ్ ముగించుకొని వెళ్లిపోయిన వెంటనే ప్రమాదం జరగటంతో హీరోతో పాటు దర్శకులు ఇతర సాంకేతిక నిపుణులు సంఘటనా స్థలానికి దూరంగా ఉన్నారు. దీంతో భారీ ప్రాణం నష్టం తప్పింది.

టామ్ క్రూజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు డొగ్ లిమన్ దర్శకుడు. 1980లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మాఫియా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ను మే 25న జార్జియాలో ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement