breaking news
doug liman
-
అంతరిక్ష ప్రయాణం
రిస్క్ తీసుకోవడం హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌కి మహా సరదా. తన సినిమాలో స్టంట్లన్నీ దాదాపు స్వయంగానే చేస్తారు. అవసరమైతే ప్రయాణిస్తున్న విమానం మీద నిల్చుంటారు. ఎల్తైన కట్టడం బూర్జ్ ఖలీఫా మీద ఫైటింగ్స్ చేస్తారు. తాజాగా ఓ సినిమా చిత్రీకరణను ఏకంగా అంతరిక్షంలోనే చేయాలనుకుంటున్నారు. దాదాపు పన్నెండు వందల కోట్ల బడ్జెట్‌తో యూనివర్శల్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇందుకోసం అక్టోబర్ 2021లో అంతరిక్ష యానం చేయనున్నారు టామ్ క్రూజ్. ఈ చిత్రదర్శకుడు డౌగ్ లిమన్తో కలసి ఈ ప్రయాణం చేయనున్నారు టామ్. చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంకా ప్రకటించలేదు. -
టామ్‌క్రూజ్ మూవీ షూటింగ్లో ప్రమాదం
హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్‌క్రూజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మెన' షూటింగ్ లో ప్రమాదం జరిగింది. షూటింగ్ లో వినియోగిస్తున్న ఓ మినీప్లేన్ క్రాష్ ల్యాండింగ్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కొలంబియాలోని మెడెలిన్ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం షూటింగ్ పూర్తి అయిన కొద్ది నిమిషాల తరువాత ప్రమాదం జరగటంతో యూనిట్లో ఎవరికీ ప్రమాదం జరగలేదు. టామ్ షూటింగ్ ముగించుకొని వెళ్లిపోయిన వెంటనే ప్రమాదం జరగటంతో హీరోతో పాటు దర్శకులు ఇతర సాంకేతిక నిపుణులు సంఘటనా స్థలానికి దూరంగా ఉన్నారు. దీంతో భారీ ప్రాణం నష్టం తప్పింది. టామ్ క్రూజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు డొగ్ లిమన్ దర్శకుడు. 1980లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మాఫియా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ను మే 25న జార్జియాలో ప్రారంభించారు.