స్వీట్‌ తింటారా?

Abhishek and Aishwarya Rai Bachchan greenlight Gulab Jamun - Sakshi

త్వరలోనే అభిషేక్‌ బచ్చన్, ఐశ్వర్యా రాయ్‌ కలసి స్వీట్‌ తినిపిస్తారట. అది కూడా గులాబ్‌ జామున్‌. ఏదైనా శుభవార్త చెప్పే ముందు స్వీట్‌ తినడం ఆనవాయితీ కదా. ఇంతకీ శుభవార్తేంటంటే.. ఈ ఇద్దరూ జంటగా ఓ సినిమాలో నటించనున్నారు. ఆల్రెడీ ఈ జంట ‘బంటీ అవుర్‌ బబ్లీ, గురు, రావణ్‌’ వంటి సినిమాల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

అయితే, తల్లయ్యాక ప్రారంభించిన సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భర్తతో కలసి ఐశ్వర్యా రాయ్‌ నటించనున్న చిత్రం ఇది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సర్వేష్‌ మేవారా దర్శకత్వంలో అనురాగ్‌ కశ్యప్‌ నిర్మించనున్నారట.  ఈ సినిమాకు ‘గులాబ్‌ జామున్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఐష్‌ ‘ఫ్యానీ ఖాన్‌’, అభిషేక్‌ ‘మన్‌ మర్జియా’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల తర్వాత వీరిద్దరూ కలసి నటించే సినిమాను ఆరంభిస్తారట.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top