నాలుగో సింహం!

sniffer dogs sent to new district - Sakshi

జిల్లాకు నూతన శునకాల కేటాయింపు 

పెండింగ్‌ కేసుల పురోగతి సాధించేనా?

నాగర్‌కర్నూల్‌ ఎడ్యుకేషన్ ‌: సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో నిందితులు కొత్త రకం నేరాలకు పాల్పడి కేసులను తప్పుదారి పట్టించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాంటి కేసులనైనా చేధించేందుకు విశ్వాసపాత్రగా పనిచేస్తాయి పోలీస్‌ జాగిలాలు.. నాగర్‌కర్నూల్‌ జిల్లా నూతనంగా ఏర్పడడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు రకాల జాగిలాలను కేటాయించింది. ఇందులో ముఖ్యమైనది లాబ్రాడర్‌ రిట్రీవర్‌ జాతికి చెందిన రాణా అనే స్నీపర్‌ డాగ్‌. ఇది భూమి లోపల దాచి ఉంచిన పేలుడు పదార్థాలను పసిగట్టి పోలీసులకు పట్టిస్తుంది. దీనివల్ల ప్రముఖులు బహిరంగ సభలు, ప్రభుత్వ కార్యక్రమాలు జరిపే సమయంలో ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త పరుస్తుంది. మరొకటి జర్మన్‌ షఫర్డ్‌ జాతికి చెందిన జాస్మీన్‌ అనే ట్రాకర్‌ డాగ్‌. దొంగతనాలు, దోపిడీలు చేసి తప్పించుకు తిరుగుతున్న వారిని గుర్తిస్తుంది. 
  

శునకాలకు ప్రత్యేక శిక్షణ  
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని మోహినాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇంటలిజెన్స్‌ ట్రెయినీ అకాడమీలో‘ కెనాన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌’లో హ్యాండ్‌లర్‌తోపాటు శునకాలకు 8నెలలు కఠోర శిక్షణ పొందాయి. శిక్షణ అనంతరం పూర్తిస్థాయిలో పరీక్షించి ఆయా జిల్లాలలో ఎస్పీ స్థాయి అధికారుల కింద విధులు నిర్వహింపచేస్తారు. అయితే ఈ శునకాలు హ్యాండ్‌లర్‌ ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి. హ్యాండ్‌లర్‌కు, శునకాలకు ఉన్న ప్రేమానురాగాలను బట్టే వాటి పనితీరు ఉంటుంది. చిన్నతనం నుంచే హ్యాండ్‌లర్‌కు అప్పగించి శిక్షణ ఇస్తారు. అనంతరం హ్యాండ్‌లర్, శునకాలు రెండింటిని ప్రభుత్వం ఆయా జిల్లాలకు కేటాయిస్తుంది. ఇందులో భాగంగానే నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రానికి రెండు శునకాలను ఏర్పాటు చేసింది.  

రాణా.. పసిగట్టడంలో దిట్ట 
రాణా 8నెలల వయసున్న సమయంలో నాకు అప్పగించారు. అప్పటి నుంచి మరో 8నెలలపాటు శిక్షణ తీసుకున్నాం. రాణా వాసన పసిగట్టడంలో ముందంజలో ఉంటుంది. రాణా, నేను ఒకే దగ్గర తిని పడుకుంటాం. మా మధ్య మనిషికి, మనిషికి ఉన్న సంబంధం మాదిరిగానే ఉంటుంది.

– కె. భాస్కర్‌గౌడ్, హ్యాండ్‌లర్‌

జాస్మిన్‌కు కోపమెక్కువ 
జాస్మిన్‌కు కోపం ఎక్కువ. చిన్నతనం నుంచి తనను నేను అర్థం చేసుకున్నా. ఇది జర్మన్‌ షఫర్డ్‌ అనే జాతికి చెందింది. ట్రాకింగ్‌ డాగ్‌ అని పిలవబడే జాస్మిన్‌కు చిన్నతనం నుంచే కోపం. దొంగతనాలు, దోపిడీలతోపాటు మర్డర్, మానభంగాలు చేసిన వారి అవశేషాలను చూపించి పంపిస్తే ఇట్టే పసిగట్టి పట్టుకుంటుంది. చాలా వేగంగా పరిగెడుతుంది.                        

– ఎం.సోమ్లా, హ్యాండ్‌లర్‌  

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top