తల్లిదండ్రులు మందలించారని యువకుడు.. | Person Deceased In Mahabububnagar | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులు మందలించారని యువకుడు..

Mar 21 2020 8:01 AM | Updated on Mar 21 2020 8:01 AM

Person Deceased In Mahabububnagar - Sakshi

సాక్షి, కల్వకుర్తి : తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మార్చాలకి చెందిన రాముడు (24) హోటళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన యువకుడిని ఏదో విషయమై అతని తల్లిదండ్రులు మందలించారు. అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను పురుగుల మందు తాగాడు.

కొద్ది సమయం తర్వాత తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా.. కుమారుడు అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడాన్ని గమనించి వెంటనే కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. పరిశీలించిన వైద్యులు.. అప్పటికే అతను మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement