అవే నన్ను అతడి మీద పడిచచ్చేలా చేశాయి | Neethu Sad Ending Love Story From Hyderabad | Sakshi
Sakshi News home page

నాకు పెళ్లైనా.. అతడ్ని మర్చిపోలేకపోతున్నా

Oct 13 2019 10:21 AM | Updated on Oct 30 2019 5:52 PM

Neethu Sad Ending Love Story From Hyderabad - Sakshi

అవే నన్ను అతడిమీద పడి చచ్చేలా చేశాయి. కొద్దిరోజులకే..

నేను ఇంటర్‌ చదివేటప్పుడు మొదటిసారి భార్గవ్‌ను చూశాను. మెరున్‌ షర్ట్‌, క్రీమ్‌ కలర్‌ ప్యాంట్‌తో బలే ఉన్నాడు. అలాగే చూస్తూ ఉండిపోయాను. ఐ థింక్‌ అది అట్రాక్షన్‌ అనుకుంటా! వన్‌సైడ్‌ లవ్‌. అతడు నా సూపర్‌ సీనియర్‌. అతనంటే నాకు పిచ్చి! ఎంతంటే చెప్పలేనంత. అతనికి తెలియకుండా అన్నీ గమనించేదాన్ని. ఆ తర్వాత అతడికి నేను తనను చూస్తున్నానని తెలిసింది. అతను కూడా నన్ను చూసేవాడు, నవ్వేవాడు, నా చుట్టూ తిరిగేవాడు. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలా నేను అతడికోసమే కాలేజ్‌కు పోయేదాన్ని. అతడి డ్రెస్సింగ్‌ స్టైల్‌, హేయిర్‌ స్టైల్‌, లుక్స్‌, నడక, బైక్‌ డ్రైవింగ్‌ ఇవన్నీ నాకు ప్రత్యేకంగా అనిపించేవి. అవే నన్ను అతడిమీద పడి చచ్చేలా చేశాయి. కొద్దిరోజులకే నా ఇంటర్‌ పూర్తయింది.

అతని డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ పూర్తయింది. ఆ తర్వాత నాన్న నన్ను డీఈడీ చేయమన్నారు. అందుకే నేను వేరే చోట ఉండి కోచింగ్‌ తీసుకోవటం మొదలుపెట్టాను. నా ధ్యాస మొత్తం భార్గవ్‌ మీదే ఉండేది. మా నాన్నను ఒప్పించి నేను కూడా అతను ఉన్న కాలేజీలోనే చేరాను. చాలా రోజుల తర్వాత నేను అతడికి కన్పించే సరికి షాక్‌ అయ్యాడు, నవ్వాడు. మళ్లీ మా ప్రేమ కథ మొదటికి వచ్చింది. తనంటే నాకు పిచ్చి! దురదృష్టం.. కొన్ని కారణాల వల్ల నాకు వేరే వ్యక్తితో పెళ్లైపోయింది. కానీ, నేనతడ్ని మర్చిపోలేకపోతున్నా, ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను.
- నీతూ, హైదరాబాద్‌ (పేర్లు మార్చాం)


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement