ఆక్స్‌ఫర్డ్‌ వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా యూత్‌క్వేక్‌

'Youthquake' named 2017 word of the year by Oxford Dictionaries - Sakshi

లండన్‌: యూత్‌క్వేక్‌ అనే పదాన్ని 2017 ఏడాదికి వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా గుర్తిస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీస్‌ ప్రకటించింది. ఈ ఏడాదిలో యువ ఓటర్లలో కలిగిన రాజకీయ చైతన్యాన్ని గుర్తిస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నామంది. ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువు ప్రకారం యూత్‌క్వేక్‌ అంటే ‘యువతరం ప్రభావం వల్ల లేదా వారి చర్యల కారణంగా వచ్చే సాంస్కృతిక, రాజకీయ, సామాజిక మార్పు’ అని అర్థం. ‘భాషాపరమైన ఆసక్తి, దాని వాడకాన్ని పరిగణలోనికి తీసుకుని యూత్‌క్వేక్‌ను ఈ ఏడాదికి వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ప్రకటించాం’ అని నిఘంటువుల విభాగం అధ్యక్షుడు కాస్పర్‌  చెప్పారు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top