
అడల్ట్ జోక్స్ వేసేది అందుకేనా!
తమ లైంగిక సామర్థ్యంపై ఎవరైనా సందేహం వ్యక్తం చేస్తారేమోననే భయం కలిగినప్పుడు కొంతమంది పురుషులు అడల్ట్ జోక్స్
వాషింగ్టన్: తమ లైంగిక సామర్థ్యంపై ఎవరైనా సందేహం వ్యక్తం చేస్తారేమోననే భయం కలిగినప్పుడు కొంతమంది పురుషులు అడల్ట్ జోక్స్ వేస్తుంటారని ఓ అధ్యయనంలో తేలింది. స్నేహితుల మధ్య తమ గుర్తింపు కోసం కూడా ఇలాంటి చౌకబారు జోక్స్ వేస్తుంటారని వెల్లడైంది.
ముఖ్యంగా మహిళలు తమ పైస్థాయిలో ఉన్న పని ప్రదేశాల్లో మగవాళ్లు ఇలాంటి అడల్ట్, యాంటీ గే జోక్స్ వేస్తుంటారని అమెరికాలోని వెస్ట్రన్ కరోలినా యూనివర్సిటీ తేల్చింది. ఈ వర్సిటీకి చెందిన పరిశోధకులు 387 మంది పురుషులపై పరిశోధన జరిపారు. వీరిని ఆన్‌లైన్ ద్వారా ఈ పరీక్షించినట్లు పేర్కొన్నారు. ఎలాంటి హాస్యాన్ని వారు ఎక్కువ ఇష్టపడతారో ప్రశ్నించారు. హాస్య చతురత ద్వారా తమ గురించి ఇతరుల్లో గట్టి అభిప్రాయాన్ని కలుగజేయొచ్చనే విషయాన్ని మగవాళ్లు బాగా విశ్వసిస్తుంటారని తేల్చారు. అలాగే అడల్ట్ జోక్స్ ద్వారా తమ మగతనాన్ని చాటిచెప్పుకుంటుంటారని పేర్కొన్నారు.