టర్కీ: తల్లి ప్రేమ మనుషులకే కాదు, సృష్టిలోని అన్ని జీవరాశులకూ సొంతం. పేగు తెంచుకుని పుట్టిన జీవి కోసం తల్లడిల్లని తల్లి ఉండదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. తాజాగా ఓ పిల్లి తన కూన అస్వస్థతగా ఉండటం గమనించి ఆసుపత్రికి పరుగెత్తిన ఘటన ఇస్తాంబుల్‌లోని టర్కీలో చోటు చేసుకుంది. వివరాలు.. ఏమైందో ఏమో కానీ హుషారుగా, చెంగుచెంగున దుంకే పిల్లి కూన ఒక్కసారిగా నీరసించడం దాని తల్లి కంట పడింది. కొంతసేపటికి అదే తిరిగి మామూలవుతుందిలే అనుకుంది. కానీ, అలా జరగలేదు. పిల్లికూన మరింత నీరసంగా అనారోగ్యం బారిన పడినట్లు కనిపించింది. (ఆన్‌లైన్ పెళ్లి; ఫోన్‌కు తాళి కట్టాడు)
దీంతో భయాందోళనకు గురైన తల్లికి గుండెలో గుబులు పట్టుకుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిల్లికూనను నోట కరుచుకుని ఆసుపత్రికి పరుగు పెట్టింది. ఎమర్జెన్సీ అన్న సంకేతాలిస్తూ వైద్యుల ముందు కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరిగింది. దాని బాధను అర్థం చేసుకున్న వైద్యులు వెంటనే దానికి సహాయం చేశారు. దీంతో ఆ కూన తిరిగి ఎప్పటిలాగే ఆరోగ్యవంతురాలైంది. పిల్లి ఆసుపత్రికి వెళ్లి, వైద్యం చేయిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. "తల్లి ప్రేమకు అంతు లేదు" అంటూ నెటిజన్లు ఆ మదర్ పిల్లిని మెచ్చుకుంటున్నారు. (అద్భుతమైన వీడియో.. థాంక్యూ!)
Yavrusu biraz haylaz biri, annesi bulduğu yerde kapıp götürüyor pic.twitter.com/GYvBXt3UQz
— Merve Özcan (@ozcanmerveee) April 27, 2020


