గుండె జబ్బు ముప్పు ముందే తెలిసిపోతుంది! 

US Scientists Discover New Way of Identify Heart Attack - Sakshi

గుండె జబ్బులను ముందుగా గుర్తించేందుకు ఓ కొత్త మార్గాన్ని కనుక్కున్నారు అమెరికాలోని విస్కాన్సిన్‌ మెడికల్‌ కాలేజీ శాస్త్రవేత్తలు. గుండె జబ్బులను ముందుగా గుర్తించేందుకు ఫార్మింగ్‌ హ్యామ్‌ రిస్క్‌ స్కోర్‌ పరీక్ష మాత్రమే ఉంది. వయసు, రక్తపోటు, కొలెస్ట్రాల్‌ మోతాదు వంటి అంశాల ఆధారంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలను అంచనా వేయడాన్ని ఫార్మింగ్‌ హ్యామ్‌ రిస్క్‌ స్కోర్‌ పరీక్ష అంటారు. తాజాగా కంప్యూటర్‌ ఎయిడెడ్‌ టొమోగ్రఫీ (సీటీ) స్కాన్ల ద్వారా గుండె జబ్బుల బారిన పడే ప్రమాదాన్ని ముందుగానే కనుగొనవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. గుండె జబ్బు లక్షణాలు లేని సుమారు 829 మందికి 2004–05 మధ్యకాలంలో సీటీ స్కాన్లు తీయగా.. 2011 వచ్చే సరికి సుమారు 156 మంది గుండె జబ్బు లేదా స్ట్రోక్‌ బారిన పడ్డారన్నారు. శరీరంలోని బృహద్ధమని గోడలపై క్యాల్షియం మోతాదులకూ.. గుండె జబ్బులకు మధ్య సంబంధం ఉన్నట్లు తమ పరిశోధనల్లో వెల్లడైందని స్టేసీ డి.ఓ కానర్‌ పేర్కొన్నారు. పరిశోధనలో పాల్గొన్న అందరి బృహద్ధమనిలో క్యాల్షియం మోతాదులు సాధారణం కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైందని వివరించారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top