అమెరికా ఒత్తిడికి లొంగలేదు..: శ్రీలంక | Sri Lanka refused USs request to land warplanes | Sakshi
Sakshi News home page

అమెరికా ఒత్తిడికి లొంగలేదు..: శ్రీలంక

Mar 20 2026 7:07 PM | Updated on Mar 20 2026 7:25 PM

Sri Lanka refused USs request to land warplanes

అమెరికాకు దెబ్బ దెబ్బ మీద తగులుతోంది. పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా హోర్మూజ్‌ జలసంధి భద్రతకు సహకరించాలన్న అభ్యర్థనను ఇప్పటికే పలు దేశాలు తిరస్కరించగా,  అమెరికా నుంచి వచ్చిన రెండు యుద్ధ విమానాలకు శ్రీలంక సైతం అనుమతి ఇవ్వలేదట. మార్చి 4, 8 తేదీల్లో ఎర్ర సముద్రం నుంచి రెండు అమెరికా యుద్ధ విమానాలకు తమ భూభాగంలోకి అనుమతి ఇవ్వాలన్న అమెరికా విజ్ఞప్తిని శ్రీలంక తిరస్కరించినట్లు ఆ దేశ అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే స్పష్టం చేశారు. 

ఈ విషయాన్ని పార్లమెంట్‌ వేదికగా ఆయన వెల్లడించారు.  ఈ తీవ్ర యుద్ధ పరిస్థితుల నడుమ తాము ఒత్తిడికి తలొగ్గకుండా అమెరికా యుద్ధ విమానాలకు తమ భూభాగంలోకి అనుమతికి నిరాకరించినట్లు ఆయన పేర్కొన్నారు. తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఒత్తిడికి తలొగ్గమనే విషయాన్ని దిసనాయకే ఈ సందర్భంగా తెలిపారు. 

‘యుద్ధం విషయంలో మేము తటస్థ వైఖరితో ఉన్నాం. మాకు చాలా ఒత్తిడులు వచ్చాయి. కానీ వాటికి తలొగ్గలేదు. అమెరికా యుద్ధ విమానాలకు శ్రీలంక మట్టల అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమతించాలనే రిక్వస్ట్‌ అమెరికా నుంచి వచ్చింది. అయినా మేము వాటిని సున్నితంగా తిరస్కరించాం.  ఈ యుద్ధంలో మా భాగస్వామ్యం లేదు. అందుకే అమెరికా యుద్ధ విమానాలను మా భూభాగంలో నిలుపుదల చేస్తామంటే వద్దని కచ్చితంగా చెప్పేశాం. 

జిబౌటి బేస్‌ నుండి ఎనిమిది యాంటీ-షిప్‌ క్షిపణులతో రెండు యుద్ధ విమానాలను మట్టల అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకురావాలని అమెరికా కోరింది. కానీ మేము అనుమతించలేదు’ అని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో శ్రీలంకను  లాగకుండా ఉండాలనే ఉద్దేశాన్ని అమెరికాకు స్సష్టంగా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. 

ఇదీ చదవండి:

ఇరాన్‌ ‘ఉండేలు’ దెబ్బ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement