‘హెచ్‌1బీ ప్రీమియం’పై సస్పెన్షన్‌ పెంపు

US extends suspension of premium processing for H-1B visas - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా హెచ్‌1బీ వీసా ఆశావహులకు మరోసారి షాకిచ్చింది. హెచ్‌1బీ వీసా దరఖాస్తులను వేగంగా పరిశీలించే ప్రీమియం ప్రాసెసింగ్‌ విధానంపై ఇప్పటికే ఉన్న తాత్కాలిక సస్పెన్షన్‌ను మరో 6 నెలల పాటు పొడిగించింది. తాజా నిర్ణయం హెచ్‌1బీ వీసాలను గణనీయంగా దక్కించుకుంటున్న భారతీయ ఐటీ నిపుణులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ విషయమై యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) స్పందిస్తూ.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు పరిశీలించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

గత కొన్ని నెలలుగా భారీగా వస్తున్న ప్రీమియం దరఖాస్తుల కారణంగా ఇతర హెచ్‌1బీ వీసాలు పెండింగ్‌లో ఉండిపోతున్నాయని వెల్లడించింది. సాధారణంగా అమెరికాలో పనిచేసే విదేశీ నిపుణులకు ఈ హెచ్‌1బీ వీసాను జారీచేస్తారు. ఈ వీసా దరఖాస్తును పరిశీలించేందుకు 6 నెలల సమయం పడుతుంది. కానీ ప్రీమియం ప్రాసెసింగ్‌ విధానంలో రూ.86,181(1,225 డాలర్లు) చెల్లిస్తే కేవలం 15 రోజుల్లో అధికారులు వీసా జారీపై తుది నిర్ణయం తీసుకుంటారు. దీంతో పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఈ విధానానికి మొగ్గుచూపుతున్నాయి. తాజాగా ప్రీమియం వీసాలపై ఉన్న తాత్కాలిక సస్పెన్షన్‌ను మరో ఆరు నెలల పాటు పొడిగించడం భారత ఐటీ నిపుణులకు శరాఘాతమేనని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top