32 పళ్లు.. 3 క్షణాలు..

Unico Smart Brush To Brush Your Teeth In Three Seconds - Sakshi

మీరు పరమ బద్దకిస్టులా.. పళ్లు తోముకోవడానికి కూడా ఆలోచించే టైపా.. లేదా మీరు బాగా బిజీనా.. అయితే.. ఇది మీలాంటోళ్ల కోసమే.. దీని పేరు యూనికో.. ఇదో స్మార్ట్‌ బ్రష్‌. కేవలం 3 క్షణాల్లో మన 32 పళ్లనూ శుభ్రం చేసేస్తుందట. ఇందులో చిన్నచిన్న సైజుల్లో చాలా బ్రష్షులుంటాయి. మైక్రో పంప్‌ సిస్టం ద్వారా టూత్‌ పేస్టు ఆయా బ్రష్షులకు చేరుతుంది. దీనికి తగిలించి ఉండే పవర్‌ యూనిట్‌ ద్వారా ఆ బ్రష్షులు పనిచేస్తాయి. మన నోటికి సరిపోయేటట్టు 4 రకాల సైజుల్లో దొరుకుతుంది.

దీంతోపాటు ఓ బాక్సు ఇస్తారు. బ్రష్షును వాడిన తర్వాత దాన్ని బాక్సులో పెట్టేస్తే.. అందులో ఉండే యూవీ కిరణాల ద్వారా అది క్లీన్‌ అయిపోతుంది. దాంతోపాటు చార్జింగ్‌ కూడా అయిపోతుంది. మొబైల్‌లో వాడుకోవడానికి వీలుగా ఓ యాప్‌ కూడా ఉంది. దాన్ని ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే.. బ్రష్షు పనిచేసే స్పీడు.. సమయాన్ని మనం మార్చుకోవచ్చు. దీని ధర రూ.8,065.   
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top