మా మద్దతుంటేనే.. మీకు అధికారం!

Trump Says Saudi King Wouldn't Last 'Two Weeks' Without US support - Sakshi

దుబాయ్‌: చమురు ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మిత్ర దేశం సౌదీ అరేబియాపై స్వరం పెంచారు. అమెరికా సైనిక మద్దతు లేకుంటే సౌదీ రాజు రెండు వారాలు కూడా పదవిలో ఉండరని హెచ్చరించారు. ముడిచమురు ధరలను తగ్గించాలని ఓపెక్, సౌదీ అరేబియాలను ట్రంప్‌ తరచూ కోరుతున్న సంగతి తెలిసిందే.

మిసీసీపీలోని సౌతవెన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘సౌదీ అరేబియాను మనం కాపాడుతున్నాం. మన మద్దతు లేకుంటే రెండు వారాలు కూడా పదవిలో ఉండరని సౌదీ రాజు సల్మాన్‌కు తేల్చిచెప్పా. సైన్యానికి మీరు డబ్బు చెల్లించాల్సిందే’ అని అన్నారు. 82 ఏళ్ల సల్మాన్‌ను ఉద్దేశించి ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు ఎప్పుడు చేశారో తెలియరాలేదు. వారిద్దరు చివరిసారిగా శనివారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై సౌదీ అరేబియా స్పందించలేదు. కాగా, ఒపెక్‌కు నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాతో ట్రంప్‌ ప్రభుత్వం సన్నిహిత సంబంధాలు కలిగివుండటం​ గమనార్హం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top