హెచ్‌–4 వీసా నిబంధన రద్దుకే మొగ్గు

Trump govt puts H1B workers' spouses on thin ice - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాకు హెచ్‌–1బీ వీసాలపై వెళ్లే వృత్తి నిపుణుల జీవిత భాగస్వాములకు అక్కడ పనిచేసుకునేందుకు వీలుగా అమలు చేస్తున్న హెచ్‌–4 వీసా నిబంధనల్ని రద్దు చేయాలన్న నిర్ణయాన్ని ట్రంప్‌ సర్కారు మరో సారి పునరుద్ఘాటించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ (ఈఏడీ)కు అర్హుల జాబితా నుంచి హెచ్‌–4 వీసాదారుల్ని తొలగించాలని ప్రతిపాదిస్తున్నామని ఫెడరల్‌ రిజిస్టర్‌ నోటిఫికేషన్‌లో అమెరికా హోం ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. దీనిపై అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ స్పందిస్తూ.. రూల్‌ మేకింగ్‌(చట్టం అమలు ప్రక్రియ) పూర్తయ్యేవరకూ హెచ్‌–4 వీసాలపై ఏ నిర్ణయం అంతిమం కాదంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top