హెచ్‌1బీ వీసా మరింత కష్టం

Trump admin makes it more difficult for H-1B visa extension - Sakshi

నిబంధనలు క్లిష్టతరం

వాషింగ్టన్‌: భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా ఉపయోగించుకునే హెచ్‌1బీ, ఎల్‌1 వంటి వీసాల రెన్యువల్‌ను అమెరికా మరింత కష్టతరంగా మార్చింది. రెన్యువల్‌కు తాను అన్ని విధాలా అర్హుడినేనని దరఖాస్తుదారుడే నిరూపించుకోవాలని అమెరికా పౌరసత్వ, వలసల సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్‌) ప్రకటించింది. ఇందుకోసం ప్రస్తుతమున్న 13 ఏళ్ల నాటి నిబంధనను సవరించి కొత్త వాటిని అమల్లోకి తెచ్చింది.

పాత పద్ధతిలో దరఖాస్తుదారుడి మరో సారి వీసా పొందేందుకు అర్హుడా? కాదా? అనే విషయాన్ని యూఎస్‌సీఐఎస్‌యే నిర్ధారించేది. ఈ విధానం ఇప్పటికే అమెరికాలో ఉన్న వారికి వర్తిస్తుందని, కొత్త దరఖాస్తదారులకు వర్తించదని అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విలియం స్టాక్‌ అన్నారు. అమెరికా ఫస్ట్‌ విధానంలో భాగంగా ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేస్తోంది. అత్యుత్తమ నైపుణ్యం ఉన్నవారికే హెచ్‌1బీ వీసాలు ఇవ్వాలని, అమెరికా ఉద్యోగాలను ఇతర దేశస్తులు తన్నుకుపోకుండా చూడాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top