టైమ్ ఉత్తమ ఆవిష్కరణల్లో ‘మామ్’ | Time is the best innovations 'Mum' | Sakshi
Sakshi News home page

టైమ్ ఉత్తమ ఆవిష్కరణల్లో ‘మామ్’

Nov 22 2014 2:03 AM | Updated on Sep 2 2017 4:52 PM

టైమ్ ఉత్తమ ఆవిష్కరణల్లో ‘మామ్’

టైమ్ ఉత్తమ ఆవిష్కరణల్లో ‘మామ్’

భారత్‌కు అంతర్జాతీయ కీర్తిని సంపాదించి పెట్టిన ‘మంగళ్‌యాన్ (మార్స్ ఆర్బిటార్ మిషన్-మామ్) మరో గౌరవాన్ని దక్కించుకుంది.

న్యూయార్క్: భారత్‌కు అంతర్జాతీయ కీర్తిని సంపాదించి పెట్టిన ‘మంగళ్‌యాన్ (మార్స్ ఆర్బిటార్ మిషన్-మామ్) మరో గౌరవాన్ని దక్కించుకుంది. 2014కుగాను టైమ్ మేగజైన్ ప్రకటించిన 25 అత్యుత్తమ ఆవిష్కరణల్లో మంగళ్‌యాన్ స్థానం సంపాదించింది. చరిత్రలోనే మొదటిసారిగా భారత్ తమ తొలి ప్రయత్నంలోనే అంగారకుడి వద్దకు విజయవంతంగా ఉపగ్రహాన్ని పంపగలిగిందని టైమ్ ఈ సందర్భంగా ప్రశంసించింది.

‘తమ మొదటి ప్రయత్నంలోనే ఎవరూ అంగారకుడిని చేరుకోలేకపోయారు. అమెరికా, రష్యాతో పాటు యురోపియన్లు కూడా ఆ పని చేయలేకపోయారు. సెప్టెంబర్ 24న భారత్ ఆ ఘనతను సాధించింది. అద్భుతమైన మంగళ్‌యాన్ ఉపగ్రహం ఆ రోజున అరుణగ్రహం చుట్టూ కక్ష్యలో ప్రవేశించింది. అంగారకుడి వద్దకు విజయవంతంగా ఉపగ్రహాన్ని పంపిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.’ అని పేర్కొంది. కేవలం 450 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని సాధించడం అద్భుతమని టైమ్ వ్యాఖ్యానించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement