'ఇది నిజంగా దేవుడి లీల' | Thirteen-month-old baby in man's arms, the only two survivors of S Sudan plane crash | Sakshi
Sakshi News home page

'ఇది నిజంగా దేవుడి లీల'

Nov 6 2015 12:29 PM | Updated on Sep 3 2017 12:08 PM

'ఇది నిజంగా దేవుడి లీల'

'ఇది నిజంగా దేవుడి లీల'

ప్రమాదంలో 13 నెలల పసిపాప నిలౌ స్వల్పగాయాలతో బయటపడడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

జుబా :  దక్షిణ సుడాన్‌లో కూలిపోయిన కార్గో విమాన ప్రమాదంలో అనూహ్యంగా తండ్రీ కూతుళ్లిద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. 37 మందిని పొట్టన బెట్టుకున్న ఈ ప్రమాదంలో 13 నెలల పసిపాప నిలౌ స్వల్పగాయాలతో బయటపడడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సుడాన్‌ రాజధాని జుబాలోని విమానాశ్రయం నుంచి టేకాఫ్‌  అయిన కొద్ది నిమిషాలకే  సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది.

స్థానిక టీవీ  ప్రతినిధి ఆచల్ డెంగ్  తొలిసారిగా  పాపను గుర్తించారు. అపస్మారక స్థితలో  పడి ఉన్న తండ్రి ఛాతీపై గాయాలతో పడి ఉండడన్ని ఆమె గమనించి రక్షణ దళాలకు సమాచారం అందించారు.  ఒక కాలు విరిగి, నుదురుమీద స్వల్ప గాయాలతో చిన్నారి బయటపడింది.  అయితే ఈ ఘోర ప్రమాదంలో చిన్నారి తల్లి, చెల్లి ప్రాణాలు  కోల్పోయారు. ఇది నిజంగా దేవుడి లీల అంటూ  డెంగ్ ఆశ్చర్యం  వ్యక్తం చేశారు. తల,  కాళ్లు, చేతులకు  తీవ్ర గాయాలయినా.. కూతురిని తన గుండెలపై   వేసుకుని రక్షించాడని  తెలిపారు. పాప తండ్రి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను స్పృహలోకి వచ్చిన తరువాత పాప వివరాలు తెలిపాడన్నారు.

 కాగా నివాసం ప్రాంతంలో విమానం  కుప్పకూలడంతో తీవ్ర నష్టం వాటిల్లింది.  37మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా ,మరికొంత మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు.  పరిమితికి  మించిన ఎక్కువ  పరిమాణంలోసరుకులు తీసుకెళ్లడం వల్లనే నైలు నది సమీపంలో విమానం కూలిపోయిందని దేశ రవాణా శాఖమంత్రి  తెలిపారు.  మృతుల సంఖ్య 37కి పెరిగిందని ప్రకటించారు.  విచారణకు ఆదేశించామని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రయాణికులకు అనుమతిలేని ఈ విమానంలో ఎంతమంది  ప్రయాణిస్తున్నారన్న విషయంలో   స్పష్టత లేదని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement