సుశీల్‌ కుమార్‌కు షాక్‌ | Sushil Kumar Losed In Assain Games | Sakshi
Sakshi News home page

ఆసియా క్రీడలు : సుశీల్‌ కుమార్‌కు షాక్‌

Aug 19 2018 4:41 PM | Updated on Aug 19 2018 7:17 PM

Sushil Kumar Losed In Assain Games - Sakshi

సుశీల్‌ కుమార్‌

భారత స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌కు ఆసియా క్రీడల్లో తొలి రోజే నిరాశ ఎదురైంది..

జకర్తా : భారత స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌కు ఆసియా క్రీడల్లో తొలి రోజే నిరాశ ఎదురైంది. పురుషుల రెజ్లింగ్‌ 74 కేజీల విభాగంలో బరిలోకి దిగిన సుశీల్‌.. బెహ్రేన్‌కు చెందిన ఆడమ్ బటిరోవో చేతిలో ఓటమి చెందాడు. సుశీల్‌పై 3-5 తేడాతో బటిరోవో గెలుపొందాడు. మొదటి రౌండ్‌లో 2-1తో దూసుకుపోయిన సుశీల్‌ ఆ తరువాత ఆ స్థాయి ప్రదర్శన కొనసాగించలేకపోయాడు. దీంతో అతను స్వర్ణ పతాకం పొందే అవకాశాన్ని కోల్పోయాడు.

ఒకవేళ బటిరోవ్‌ ఫైనల్‌కు చేరితే రిపిచేజ్‌ ద్వారా కాంస్య పతాకం కోసం సుశీల్‌ పోటిపడే అవకాశం ఉంటుంది. సుశీల్‌ కుమార్‌ గతంలో రెండు సార్లు భారత్‌కు ఒలంపిక్‌ పతకాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశీల్‌పై భారత అభిమానులు పెట్టుకున్న ఆశలు అడియాశలైయ్యాయి. అంతకుముందు భారత్‌కు ఆసియా క్రీడల్లో తొలి పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో అపూర్వి చండేలా, రవికుమార్‌ జోడీ కాంస్య పతకాన్ని సాధించింది. 

Advertisement
 
Advertisement
Advertisement