శ్రీలంకలో హింస ; ఎమర్జెన్సీ విధింపు

Sri Lankan Government Impose Emergency For 10 Days - Sakshi

కొలంబో : లు ప్రాంతాల్లో శాంతిభద్రతలు అదుపుతప్పిన నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నేతృత్వంలో మంగళవారం భేటీ అయిన కేబినెట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి దిస్సనాయకే మీడియాకు తెలిపారు. మంగళవారం నుంచి 10 రోజుల పాటు ఎమర్జెన్సీ అమలులో ఉంటుందని ఆయన చెప్పారు.

మైనారిటీలపై భీకర దాడులు : సెంట్రల్‌ శ్రీలంకలోని క్యాండీ జిల్లావ్యాప్తంగా గడిచిన వారం రోజులుగా హింసాయుత ఘటనలు నమోదయ్యాయి. ముస్లిం మైనారిటీలపై మెజారిటీ బౌద్ధుల్లో కొన్ని గ్రూపులు వరుస దాడులకు పాల్పడ్డాయి. ఇవి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే ప్రమాదాన్ని గుర్తించిన ప్రభుత్వం.. క్యాండీ రాష్ట్ర వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించింది. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top