వెతక్కుంటూ వెళ్లి చితక్కొ‍ట్టాడు!

Shop Keeper Beaten Customer For Giving Negative Review - Sakshi

బీజింగ్‌: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో చాలా మంది రివ్యూలను చూసే ఒక వస్తువును కొంటుంటారు. ఆన్‌లైన్‌ నుంచి ఏదైన కొన్నప్పుడు మనం కొన్న రేటుకు తగ్గట్టుగా ఆ వస్తువు క్వాలిటీ ఉందా, చెప్పిన తేదికి వస్తువును డెలివరీ చేశారా, వస్తువు ఏమైనా పాడైందా, రిటర్న్‌ పాలసీ ఎలా ఉంది ఇవన్నీ చూసి రేటింగ్‌ ఇస్తూ ఉంటాం. అయితే అలా రేటింగ్‌ ఇవ్వడమే ఒక కస్టమర్‌ పాలిట శాపంగా మారింది. నెగిటివ్‌ రివ్యూ ఇచ్చిన పాపానికి ఆమెను వెతుకుంటూ 850 కిలోమీటర్లు ప్రయాణించి మరీ ఆమెను చావ గొట్టాడు ఒక షాపు యజమాని. చైనాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

(వాచ్‌.. తూచ్‌..)

జియో డి అనే కస్టర్‌మర్‌ ఒక ఆన్‌లైన్‌స్టోర్‌ నుంచి 300 యువాన్ల విలువైన బట్టలను ఆర్డర్‌ పెట్టింది. అయితే మూడురోజుల్లో అవి వస్తాయని కంపెనీ నుంచి మెసేజ్‌ వచ్చింది. అయితే అనుకున్న తారీఖు నాటికి అవి డెలివరీ కాలేదు. దీంతో ఆమె ఆన్‌లైన్‌లో ఆ స్టోర్‌కు నెగిటివ్‌ రివ్యూ ఇచ్చింది. దీంతో స్టోర్‌ స్కోరు 12 పాయింట్లు పడిపోయింది. దీంతో కోపం వచ్చిన యజమాని జాంగ్‌ ఆమెను వెతుక్కుంటూ వెళ్లి నెగిటివ్‌ రివ్యూ ఇచ్చినందుకు ఆమెను రోడ్డు మీదే చితక్కొట్టాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. తీవ్రంగా గాయాలపైన ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ప్రతిఒక్కరూ షాపు యజమాని మీద తీవ్రంగా మండిపడుతున్నారు. (ఆన్‌లైన్‌ ద్వారా ఘరానా మోసం; యువకుల అరెస్టు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top