భూటాన్‌లో ప్రిన్స్ జంట | Prince couple in Bhutan | Sakshi
Sakshi News home page

భూటాన్‌లో ప్రిన్స్ జంట

Apr 15 2016 12:43 AM | Updated on Sep 3 2017 9:55 PM

భూటాన్‌లో ప్రిన్స్ జంట

భూటాన్‌లో ప్రిన్స్ జంట

బ్రిటన్ యువరాజు విలియం, కేట్ దంపతులు గురువారం భూటాన్ పర్యటనకు వచ్చారు. రాజధాని థింపులో వారికి అధికారులు సంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా స్వాగతం పలికారు.

థింపు: బ్రిటన్ యువరాజు విలియం, కేట్ దంపతులు గురువారం భూటాన్ పర్యటనకు వచ్చారు. రాజధాని థింపులో వారికి అధికారులు సంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా స్వాగతం పలికారు. విలియం, కేట్‌లు భూటాన్‌లో రెండు రోజులపాటు పర్యటిస్తారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్‌చుక్, రాణి జట్సన్ పేమాను వారు తషికో డోంగ్ కోటలో కలుసుకున్నారు. భారత్‌నుంచి విలియం దంపతులు గురువారం ఉదయం థింపు చేరుకున్నారు. గురువారం రాత్రి విలియం, కేట్ గౌరవార్థం భూటాన్ రాజు విందు ఏర్పాటు చేశారు. వీరు శనివారం  ఆగ్రాకు వస్తారు.

 ఖడ్గమృగాన్ని చంపిన వేటగాళ్లు: బుధవారం రాత్రి విలియం దంపతులు అస్సాం గువాహటిలో కజిరంగా జాతీయ పార్కు సమీపంలోని రిసార్టులో ఉండగానే భారీ భద్రతను కూడా లెక్కచేయకుండా వేటగాళ్లు పార్కులో ఖడ్గమృగాన్ని వేటాడి చంపి దాని కొమ్మును తీసుకెళ్లారు. అధికారులు గురువారం ఖడ్గమృగం కళేబరాన్ని కనుగొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement