ఈవీఎంలు, సినిమాలు నిషేధించమని పిటిషన్ | Sakshi
Sakshi News home page

ఈవీఎంలు, సినిమాలు నిషేధించమని పిటిషన్

Published Sat, Sep 24 2016 10:29 PM

ఈవీఎంలు, సినిమాలు నిషేధించమని పిటిషన్ - Sakshi

లాహోర్: ఇండియా నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్లు(ఈవీఎం) లను కొనుగోలు చేయరాదని, భారతీయ సినిమాలను పాకిస్థాన్లో బహిష్కరించాలని లాహోర్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను అజర్ సిద్ధీఖి అనే న్యాయవాది దాఖలు చేశారు. పాక్ ఎలక్షన్ కమిషన్(పీఏసీ) కు ఈవీఎంల అమ్మకం కోసం భారతీయ కంపెనీలు ఇంద్ర కామ్రా, రిలయన్స్, మార్ఫో బిడ్లు దాఖలు చేశాయని ఇందులో ఒకరి నుంచి ఈవీఎంలను పీఏసీ కొనుగోలు చేసే అవకాశం ఉందని పిటిషనర్ ఆరోపించారు.  ఇండియాలో సినీ నటులను భయపెడుతున్నారని పిటిషనర్ అరోపించారు. ఇండియన్ సినిమాలను సైతం నిషేధించాలని మరో పిటిషన్ను సిద్ధిఖి దాఖలు చేశారు.

Advertisement
Advertisement