వాళ్లు చనిపోయినా... | Paul Walker new entry in Forbes dead celebrity list | Sakshi
Sakshi News home page

వాళ్లు చనిపోయినా...

Oct 28 2015 3:16 PM | Updated on Sep 3 2017 11:38 AM

వాళ్లు చనిపోయినా...

వాళ్లు చనిపోయినా...

తాజాగా ఫోర్స్బ్ జాబితాలో ఇపుడు హాలీవుడ్ స్టార్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ హీరో పాల్ వాకర్ చేరాడు.

లాస్ ఏంజిల్స్ :  ఏనుగు చచ్చినా...బతికినా ఒకటే విలువ  అని తెలుగులో ఓ నానుడి. తాజా ఫోర్బ్స్   చనిపోయిన సెల్రబిటీ  ధనవంతుల లిస్టు చూస్తే ఈ సామెత  గుర్తు రాక మానదు. చనిపోయి తర్వాత  కూడా కొంతమంది సెలబ్రిటీలు ఫోర్బ్స్ ధనవంతుల లిస్టులో చేరారు.  తాజాగా ఆ జాబితాలో ఇపుడు హాలీవుడ్ స్టార్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ హీరో పాల్ వాకర్ చేరాడు. ఫోర్బ్స్ డెడ్ సెలబ్రిటీల లిస్ట్‌లో కొత్తగా చోటు సంపాదించి తొమ్మిదో స్థానంలో ఆక్రమించాడు. ఇప్పుడతను గడిచిన ఏడాది పాల్ వాకర్ పది మిలియన్ డాలర్లు ఆర్జించాడు.

అటు  పాప్ సంగీత రారాజు, మైఖేల్ జాక్సన్  వరుసగా మూడోసారి టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానాల్లో ఎల్విస్ ప్రెస్లీ, ఛార్లెస్ ష్కల్జ్, బాబ్ మార్లే, ఎలిజబెత్ టేలర్ 5వ స్థానంలో కొనసాగుతుండగా, మార్లిన్ మాన్రో, జాన్ లెన్నాన్, ఆల్బర్ట్ ఐన్ స్టీన్  తదితరులు తరువాతి స్థానాలను ఆక్రమించారు. కాగా రెండేళ్ల క్రితం అంటే 2013లో హై స్పీడ్ కారు ప్రమాదంలో పాల్ ప్రాణాలు కోల్పోయాడు.   ఈ అనూహ్య పరిణామంతో ఫాస్ట్  అండ్ ఫ్యూరియస్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement