పెళ్లి కోసం పాకిస్తానీ ఏంచేశాడంటే..? | Pakistani Groom Wears Gold Tie And Shoes Worth Rs 25 Lakhs | Sakshi
Sakshi News home page

పెళ్లి కోసం పాకిస్తానీ ఏంచేశాడంటే..?

Apr 14 2018 7:26 PM | Updated on Apr 14 2018 7:26 PM

Pakistani Groom Wears Gold Tie And Shoes Worth Rs 25 Lakhs - Sakshi

లాహోర్‌ : పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి పెళ్లి ఇప్పడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. పెళ్లి ఏంటి వైరల్‌ అవడం ఏంటి అని అనుకోకండి. అది సాదా సీదా పెళ్లికాదు. ఎందుకంటే పెళ్లికొడుకు ధరించిన టై, షూలు అంత కాస్ట్‌లీ మరి. వివరాల్లోకి వెళ్తే.. లాహోర్‌కు చెందిన హఫీజ్‌ సల్మాన్‌ షాహిద్‌ పెద్ద వ్యాపార వేత్త. కుటుంబానికి ఏకైక కుమారుడు. ఇంకేముంది తన పెళ్లి అందరూ చెప్పుకునే విధంగా ఉండాలని భావించాడు. 

అనుకున్నదే తడవుగా 17లక్షల రూపాయలు పెట్టి బంగారు షూ చేయించాడు. అంతేకాదు మరో ఐదు లక్షలు పెట్టి టై కూడా తయారు చేయించాడు. దీనితో పాటు బంగారు షూట్‌ చేయించాడు. వాటికి అదనంగా రంగురాళ్లతో డిజైన్‌ కూడా కుట్టించాడు. వీటితో పాటు పలు అదనపు హంగులు అన్నీ కలిపి సుమారు 25లక్షల రూపాయలను పెట్టి ప్రత్యేకంగా పెళ్లి వస్తువులను డిజైన్‌ చేయించుకున్నాడు. పెళ్లిలో వాటికి కాపలాగా భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement