పాక్‌లో ఇమ్రాన్‌కు షాక్‌

Opposition Parties Protest against ECP and Election 2018 Results - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌(పీటీఐ)కు ప్రతిపక్ష పార్టీల నుంచి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా జరిగిన ఉపఎన్నికలు ఇమ్రాన్‌ఖాన్‌కు షాక్‌ ఇచ్చాయి. పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌(పీఎంఎల్‌–ఎన్‌) అధినేత నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి పార్లమెంట్‌లో తన బలాన్ని‡ పెంచుకుంది. జూలైలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్‌ ఐదు చోట్ల పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఇమ్రాన్‌ గెలుపొందిన నాలుగు స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా.. లాహోర్, బన్ను స్థానాల్లో పీటీఐకి ఓటమి ఎదురైంది. పాక్‌ మాజీ ప్రధాని షాహిద్‌ అబ్బాసీ ఎన్‌ఏ–124 లాహోర్‌ స్థానంలో పీటీఐ అభ్యర్థిపై సునాయాసంగా గెలుపొందారు. పీఎంఎల్‌–నవాజ్, పీటీఐలు చెరో నాలుగు జాతీయ అసెంబ్లీ స్థానాలను గెల్చుకున్నాయని పాక్‌ ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top