కరోనా సోకినట్లు నటించండి: న్యూజిలాండ్‌ ప్రధాని

New Zealand Prime Minister Says Act Like Have COVID 19 Amid Lockdown - Sakshi

న్యూజిలాండ్‌లో నెలరోజుల పాటు ఎమర్జెన్సీ

వెల్లింగ్‌టన్‌: మహమ్మారి కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తవుతున్నాయి. ప్రాణాంతక వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపడతున్నాయి. పలు యూరప్‌ దేశాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ ప్రకటించగా... భారత్‌ మంగళవారం రాత్రి నుంచి 21రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించింది. ఈ క్రమంలో నెల రోజుల పాటు దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా అర్డెర్న్‌ మంగళవారం అర్ధరాత్రి ప్రకటన చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని పిలుపునిచ్చారు. నిత్యావసర సరుకుల కొసం మినహా ఎవరూ ఇంటి 
నుంచి బయటకు రాకూడదన్నారు. 
(చదవండి: కరోనా వైరస్‌: ఎందుకంత ప్రమాదకారి?)

ఈ మేరకు... ‘‘కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు.. ఈరోజు అర్ధరాత్రి నుంచి నాలుగు వారాల పాటు ఇంట్లోనే ఉందాం. ప్రాణంతక వైరస్‌ వ్యాప్తి గొలుసును తెంచేద్దాం.  పరిస్థితులు చేజారకముందే జాగ్రత్తపడదాం. నాలుగు వారాల తర్వాత మనం ఏ మేరకు విజయం సాధించామో తెలుస్తుంది’’ అని జెసిండా పార్లమెంటులో ప్రకటించారు. మీ ప్రతీ కదలిక ఇప్పుడు ప్రతీ ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. మీకో ఉపాయం చెప్పనా.. ఎవరూ మీ దగ్గరికి రాకుండా ఉండాలంటే కోవిడ్‌-19 సోకినట్లుగా నటించండి’’ అని పేర్కొన్నారు. 
(చదవండి: బాధ్యత మరిచి... బలాదూర్‌గా తిరిగేసి...)

కాగా దాదాపు 50 లక్షల జనాభా కలిగిన న్యూజిలాండ్‌లో ఇప్పటివరకు 250 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కరోనా ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేసిన జెసిండా ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చిరు వ్యాపారులు, ఉద్యోగులకు ఆర్థిక సాయం అందించేందుకు బిలియన్‌ డాలర్ల నిధులను కేటాయించింది. అదే విధంగా ఇంటి అద్దెలు పెంచకుండా... కిరాయిదార్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సామాజిక, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇక న్యూజిలాండ్‌లో ఎమర్జెన్సీ విధించడం ఇది రెండోసారి. 2011లో భారీ భూకంపం సంభవించిన నేపథ్యంలో తొలిసారి అత్యవసర పరిస్థితి విధించింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

05-04-2020
Apr 05, 2020, 03:39 IST
హిమాయత్‌నగర్‌: కింగ్‌కోఠి ప్రాంతంలో కరోనా వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. ఇక్కడి ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రాగా, ఆ ఇంట్లో...
05-04-2020
Apr 05, 2020, 02:33 IST
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు, దాని చుట్టుపక్కల పల్లెలను అధికారులు శనివారం జల్లెడ పట్టారు....
05-04-2020
Apr 05, 2020, 01:40 IST
సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 15తో లాక్‌డౌన్‌ ముగియనుంది. ఆ తరువాత?.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందున్న ప్రశ్న ఇది....
05-04-2020
Apr 05, 2020, 01:19 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. శనివారం మరో 43 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో...
04-04-2020
Apr 04, 2020, 21:12 IST
కరోనా కట్టడికి మోదీ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపట్టడం లేదని రాహుల్‌ గాంధీ విమర్శించారు.
04-04-2020
Apr 04, 2020, 20:24 IST
సాక్షి, ముంబై: దేశంలో క‌రోనా పాజిటివ్‌ కేసులు మ‌హారాష్ట్రలో ఎక్కువ‌గా వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఆరు నెల‌ల చిన్నారి కూడా ఈ...
04-04-2020
Apr 04, 2020, 20:19 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అల్లకల్లోలగా మారింది. రోజురోజుకి...
04-04-2020
Apr 04, 2020, 19:54 IST
కరోనా బారిన పడిన బాలీవుడ్ గాయ‌ని క‌నికా క‌పూర్ ఊరట లభించింది.
04-04-2020
Apr 04, 2020, 19:41 IST
సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని 130 కోట్ల మంది మరోసారి కరోనాను పారదోలేందకు తమ గొప్ప సంకల్ప బలాన్ని చాటాలని ప్రధాని...
04-04-2020
Apr 04, 2020, 19:15 IST
కోవిడ్‌ బారిన పడి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఓ యువకుడికి అభినందన పూర్వక వీడ్కోలు లభించింది.
04-04-2020
Apr 04, 2020, 19:02 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ సోకిన లక్షణాలు కలిగిన వారిని ట్రాక్‌ చేయడం కోసం లండన్‌లో ప్రత్యేకంగా ఓ...
04-04-2020
Apr 04, 2020, 18:56 IST
లండ‌న్ : సాధార‌ణంగానే హాలీడేస్ వ‌స్తే  అక్క‌డికి తీసుకెళ్లు, ఇక్క‌డికి తీసుకెళ్లు అంటూ పిల్ల‌లు మారాం చేస్తుంటారు. లాక్‌డౌన్ కార‌ణంగా...
04-04-2020
Apr 04, 2020, 18:27 IST
లాక్‌డౌన్‌ గడువు 14తో ముగియనుండటంతో ప్రధాని ఇంకా ఏమైనా చెబుతారా అనేది ఆసక్తికరంగా మారింది. 
04-04-2020
Apr 04, 2020, 17:58 IST
కరాచీ: కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే పలువురు క్రీడాకారులు చేయూతనివ్వగా ఇప్పుడు వారి జాబితాలో పాకిస్తాన్‌ మాజీ...
04-04-2020
Apr 04, 2020, 17:45 IST
ఈ సమయంలో భారతీయులంతా ఒక్కటిగా ఉండాలి
04-04-2020
Apr 04, 2020, 17:13 IST
వాళ్లు ఇద్దరూ డాక్టర్లే... ఆమె పేరు నైలా షిరీన్‌.. అతడి పేరు కషీఫ్‌ చౌదరి.. ఒకరేమో న్యూయార్క్‌లో ఉంటారు.. మరొకరు...
04-04-2020
Apr 04, 2020, 17:08 IST
సింగ‌పూర్ :  క‌రోనా కార‌ణంగా 88 ఏళ్ల  వ్య‌క్తి మ‌ర‌ణించాడు. వారంలో ఇది నాలుగో మ‌ర‌ణం. దీంతో అక్క‌డ మ‌ర‌ణాల...
04-04-2020
Apr 04, 2020, 16:49 IST
విద్యుత్‌ దీపాలు ఆర్పాలన్న ప్రధాని పిలుపుపై అనుమానాలను నివృత్తి చేసిన కేంద్రం
04-04-2020
Apr 04, 2020, 16:07 IST
ముంబై: కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేసి ప్రజలను అప్రతమత్తం చేస్తుంటే.....
04-04-2020
Apr 04, 2020, 16:04 IST
ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి సినీ పరిశ్రమను తీవ్రంగా కుదిపేసింది. లాక్‌డౌన్‌ వల్ల  సినిమా షూటింగ్‌లన్నీ నిలిచిపోవడంతో సినీ కార్మికులు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top