
ధనవంతుడైన పార్లమెంటేరియన్.. ప్రధానే!
పాకిస్థాన్ పార్లమెంటేరియన్లందరిలోకీ ధనవంతుడు ఎవరో తెలుసా?
ఇస్లామాబాద్
పాకిస్థాన్ పార్లమెంటేరియన్లందరిలోకీ ధనవంతుడు ఎవరో తెలుసా? ఇంకెవరు.. సాక్షాత్తు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫే. ఆయన మొత్తం రూ. 200కోట్ల విలువ చేసే ఆస్తులతో అందరికంటే ముందంజలో ఉన్నారు. అయితే.. ఆ దేశ ప్రధాని ఒక్కరికీ ఆస్తులు ఇంతలా పెరిగినప్పటికీ పాకిస్థాన్ లోని లక్షలాది మంది ప్రజలు ఇంకా దారిద్ర్య రేఖ దిగువనే నివసిస్తున్నారు.
పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ కి సమర్సించిన అఫిడవిట్ లో 2014-15 సంవత్సరానికి గానూ షరీఫ్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. పాకిస్తాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తన ఆస్తుల విలువ రూ. 3.3 కోట్లు మాత్రమేనని ఎన్నికల కమిషన్ కి ఇచ్చిన అఫిడవిట్ లో పేర్కొన్నారు.