గ్రహాంతర జీవాన్వేషణ కోసం 660 కోట్ల ప్రాజెక్టు | Mark Zuckerberg, Yuri Milner and Stephen Hawking to begin $100 million search for alien life on a nearby Earth-like planet | Sakshi
Sakshi News home page

గ్రహాంతర జీవాన్వేషణ కోసం 660 కోట్ల ప్రాజెక్టు

Sep 24 2016 3:31 AM | Updated on Sep 4 2017 2:40 PM

గ్రహాంతర జీవాన్వేషణ కోసం 660 కోట్ల ప్రాజెక్టు

గ్రహాంతర జీవాన్వేషణ కోసం 660 కోట్ల ప్రాజెక్టు

గ్రహాంతర జీవుల అన్వేషణ కోసం ముగ్గురు కుబేరులు ఒక ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

జుకర్‌బర్గ్, హాకింగ్, మిల్నర్‌ల యత్నం
లండన్: గ్రహాంతర జీవుల అన్వేషణ కోసం ముగ్గురు కుబేరులు ఒక ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. భూమికి అతి సమీపంలో ఉన్న భూమిని పోలిన గ్రహం ప్రాక్జిమా బి నుంచి రేడియో సిగ్నల్స్‌ను వినడం దీని లక్ష్యం. ‘బ్రేక్‌త్రూ లిజన్’ పేరుతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నామని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, రష్యా వ్యాపారవేత్త యూరీ మిల్నర్, భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌లు ఓ ఆంగ్ల పత్రికకు చెప్పారు. దీని వ్యయం 10 కోట్ల డాలర్లు(రూ.660 కోట్లు).  ప్రాక్జిమా బి భూమికి నాలుగు కాంతి సంవత్సరాల దూరం(25 లక్షల కోట్ల కి.మీ)లో ఉంది. అక్కడికి పంపే వ్యోమనౌకలు వచ్చే కొన్ని దశాబ్దాల్లోనే గమ్యం చేరుకునే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement