
ఇంకో పోలీసయితే కాల్చిపడేసేవారే..
ప్రతి వ్యక్తిలో మంచి మనిషి ఉంటాడని, అది గుర్తించగలిగితే ఆ వ్యక్తిలోని రాక్షసత్వాన్నైనా ఇట్టే తీసిపారేయొచ్చని నిరూపించాడు ఓ పోలీసు అధికారి.
దీంతో వణికిపోయిన పోలీసుల్లో కొంతమంది అతడిని కాల్చే ప్రయత్నం చేయగా వారిని వద్దని ఆపేసి అనిరుత్ మాలీ అనే పోలీసు అధికారి అద్భుతం చేశాడు. అతడిని మాటలతోనే సముదాయించాడు. ఆ వ్యక్తి తనకు తెలుసని అదే వ్యక్తితో చెప్పి తాను ఏం చేయబోనని కత్తిపక్కకు పడేసి తన దగ్గరకు రావాలని కోరాడు. పోలీసు మాటలు నమ్మిన ఆ వ్యక్తి నిజంగానే కత్తిని ఆ పోలీసుకే ఇస్తుండగా శంకర్‌దాదా సినిమాలో బాధ ఉన్న వ్యక్తిని నటుడు చిరంజీవి ఎలా హగ్ చేసుకొని ఓదార్చుతాడో అచ్చం అలాగే ఓదార్చాడు.
దీంతో అతడు కన్నీటి పర్యంతం అయ్యాడు. వాస్తవానికి అతడు ఓ సంగీతకారుడు. అయితే, అతడి గిటార్‌ను ఎవరో ఎత్తుకెళ్లారు. దీంతో అతడికి వేరే మార్గం లేక మూడు రోజులుగా సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నాడు. అయితే, పనిచేయించుకున్న వ్యక్తి అతడికి డబ్బు చెల్లించకపోవడంతో ఆ మానసిక ఒత్తిడిలో కత్తిపట్టుకొని పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. అయితే, ఆ వ్యక్తిని దయగల పోలీసు కాస్త మళ్లీ మాములు వ్యక్తిలా మార్చాడు.